Wednesday 4 June 2014

పవన్‌కళ్యాణ్‌ను రాజ్యసభకు ఎంపిక కానున్నారా?


మరో రసవత్తర పోరుకు తెర లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తమకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని కోరింది. ఈ మేరకు ఎన్నికల ముందే ఓ ఒప్పందం కుదిరందని సమాచారం. సర్దుబాట్లలో భాగంగా తరువాత రాజ్యసభ స్థానం ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నాయకుడు చంద్రబాబు బిజెపికి మాటిచ్చారు. దీంతో ప్రత్యేకించి బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజ్యసభ రేసులో వున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్‌కళ్యాణ్‌ను రాజ్యసభకు ఎంపిక కానున్నారా? అనే అంశం కూడా మళ్లీ తాజాగా తెరపైకి వచ్చింది.
సీమాంధ్రలో ఎవరికోసం ఈ స్థానం అన్న సందేహం తలెత్తుతుంది. ఎన్టీఆర్‌ కుటుంబంపై ప్రేమతో పురంధేశ్వరిని ఎంపీని చేస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఇక సాధారణ ఎన్నికలలో ప్రధాన ప్రచార ఆకర్షణగా నిలిచిన పవన్‌ కళ్యాణ్‌ను వదులుకోరాదని, ఎలాగైనా తమ పార్టీకి మద్దతు దారుగా శాశ్వతంగా ఫిక్స్‌ చేయాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ అంగీకరిస్తే, ఈ సీటును ఆయనకు ఇవ్వాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా దానికి సుముఖంగానే వున్నారు. అయితే పవన్‌ కొన్నాళ్లు సినిమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. కానీ రాజ్యసభ సభ్యత్వం అన్నది సినిమా వ్యవహారాలకు అడ్డురాదని, కళాకారుడిగా రాజ్యసభకు రావడం, తన వృత్తి కొనసాగించడం తప్పు కాదని, పవన్‌కు నచ్చ చెప్పాలని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఒకసారి కమలనాధుల వలలో పడితే ఇక జనసేన వ్యవహారాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వస్తుందని పవన్‌ భావిస్తున్నారు.
నిజానికి ఇప్పట్లో ఆ వ్యవహారాలు పట్టించుకునే అవకాశమూ, అవసరమూ రెండూ పవన్‌కు లేవు. ఫలితంగా పవన్‌ ఇటు, అటు ఊగిసలాడుతున్నారు. మోడీ కనుక పట్టుపడితే కాదనకపోవచ్చు అని ఆ పార్టీ నాయకుడొకరు అన్నారు. అప్పుడు అటు మెగాస్టార్‌, ఇటు పవర్‌స్టార్‌ ఇద్దరూ రాజ్యసభలో తళుక్కున మెరుస్తారని భావిస్తున్నారు. మరి ఫైనల్ ఈ సీటు ఎవరికి అందివస్తుందో మరికొద్ది రోజుల్లోనే తేలబోతోంది.

No comments:

Post a Comment